ముంబై ఇండియన్స్ వరుసగా రెండో మ్యాచ్ ఓడిపోయింది. మొదటి మ్యాచ్ చెన్నై మీద చెపాక్ లో ఓడిపోతే రెండో మ్యాచ్ గుజరాత్ లో అహ్మదాబాద్ లో ఓడిపోయింది. ఈ రెండు మ్యాచుల్లోనూ గెలిచే స్థితిని క్రియేట్ చేసుకున్నా ముంబై ఇండియన్స్ జోరు చూపించకపోవటమే ఈ ఓటములుకు కారణంగా కనిపిస్తోంది. ప్రధానంగా నిన్న గుజరాత్ తో జరిగిన కెప్టెన్ గా పాండ్యా ఫెయిల్యూర్స్ చాలా కనిపించాయి. టీమ్ ఫైనల్ 11లోనే తప్పిదాలు ఉన్నాయి. మొదటి మ్యాచ్ చెన్నై మీద అద్భుతంగా బౌలింగ్ చేసిన యువ స్పిన్నర్ విఘ్నేశ్ పుత్తూరును ఎందుకు తప్పించారో పాండ్యా కే తెలియాలి. అంత చిన్న కుర్రోడు చెన్నై లాంటి సీనియర్ జట్టుపై భయం లేకుండా 3 వికెట్లు తీస్తే అతన్ని పక్కన పెట్టేసి ముజిబుర్ రెహ్మాన్ ను తీసుకున్నారు. అన్నింటికంటే పెద్ద లోటు విల్ జాక్స్ ను పక్కన పెట్టేయటం. ఆర్సీబీలో ఆడి గత సీజన్ లో తన చివరి మ్యాచ్ లో సెంచరీ బాదిన విల్ జాక్స్ ను ఒక్క మ్యాచ్ ఫెయిల్యూర్ కే పక్కన పెట్టేసేయటం మరో తప్పిదంగా కనిపిస్తోంది. పోనీ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫీల్డ్ ప్లేస్మెంట్స్ విషయంలోనూ పాండ్యా ప్రెజర్ కి లోనవుతున్నాడు. నిన్న పాండ్యా పెడుతున్న ఫీల్డ్ ప్లేస్మెంట్స్ చూసి చూసి చిరాకొచ్చిన రోహిత్ శర్మ..దీపక్ చాహర్ బౌలింగ్ కి తనే ఫీల్డింగ్ సెట్ చేశాడు. ఈ నెక్ట్స్ బంతికే హిట్టర్ రూథర్ ఫర్డ్ వికెట్ దక్కింది ముంబైకి. బ్యాటింగ్ డెప్త్ ఉండేలా చూసుకోవటం...ఒక్క మ్యాచ్ కే టీమ్ ను మార్చేస్తూ ఉండకుండా ఎర్లీ స్టేజ్ కాబట్టే అవకాశాలు ఇస్తూ టీమ్ ను బిల్డ్ చేయటం...ఫీల్డింగ్ లో ప్లాన్ ఏ ప్లాన్ బీ అంటూ వ్యూహాలతో ప్రత్యర్థిని చిత్తు చేయటం లాంటి వాటిపై కెప్టెన్ పాండ్యా దూకుడు పెంచకపోతే ఈ పరాజయాల పరంపర కొనసాగే అవకాశమే కనిపిస్తోంది.